అస్వస్థతకు గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఎయిమ్స్‌లో చికిత్స
Former Prime Minister Manmohan Singh | మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటనే

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఫ్లూయిడ్స్ ఇస్తున్నది. డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్ వైద్యుల బృందం మాజీ ప్రధానికి చికిత్సలు అందిస్తున్నది. జ్వరంతో పాటు శ్వాస సమస్యలు, చెస్ట్ పెయిన్ ఉన్నట్లు తెలుస్తున్నది.
మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా బారినపడ్డారు. జ్వరం ఉండడంతో ఎయిమ్స్‌లో చేర్పించిన సమయంలో కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు మార్చి 4న, ఏప్రిల్ 3న కొవిడ్ టీకా తీసుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన మన్మోహన్ సింగ్.. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2004-2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. 2009లో ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

