Rajesh Das: లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి మూడేళ్ల శిక్ష
Rajesh Das: సీఎం విజిట్ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే.. సీనియర్ ఆఫీసర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు 2021లో మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఫిర్యాదు చేసింది. ఆ కేసులో ఇవాళ విల్లుపురం కోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్‌కు మూడేళ్ల శిక్ష విధించింది.
చెన్నై: మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్(Rajesh Das)కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. విల్లుపురం కోర్టు ఆ కేసులో తీర్పును వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి పది వేల జరిమానా కూడా కోర్టు విధించింది. 2021 ఫిబ్రవరిలో సీనియర్ అధికారిపై మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఫిర్యాదు నమోదు చేసింది. సీఎం పళనిస్వామికి భద్రత కల్పించేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సీనియర్ ఆఫీసర్ అనుచితంగా వ్యవహరించినట్లు ఆ మహిళా ఆఫీసర్ ఫిర్యాదు చేసింది.
అన్నాడీఎంకే ప్రభుత్వం రాజేశ్ దాస్‌ను సస్పెండ్ చేసింది. ఈ కేసును విచారించేందుకు ఆరుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దర్యాప్తు సమయంలో సుమారు 68 మంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో అప్పీల్ చేసుకోవచ్చు అని ప్రాసిక్యూషన్ బృందం పేర్కొన్నది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ అంశం కీలకంగా మారింది. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

