దుబాయ్‌లో బంగారు బాట!
డిజైన్లతో రూపొందించిన బంగారు హారాల నుంచి పెట్టుబడి కోసం కొనుగోలు చేసే బంగారు కడ్డీల వరకు అనేకరకాల ఉత్పత్తులతో దుబాయ్‌లోని సంప్రదాయ మార్కెట్లు చాలాకాలంగా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
- ప్రపంచంలోనే తొలి 24 క్యారెట్ల నడక మార్గం
- ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించనున్నట్టు దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకటన
దుబాయ్: దుబాయ్ తన మెరిసే ఆకాశహర్మ్యాల సొగసుకు మరో బంగారు ఆకర్షణను జోడించేందుకు సిద్ధమవుతున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత పొడవైన 24 క్యారెట్ల బంగారు నడక మార్గాన్ని 2026 చివరినాటికి ప్రారంభించనున్నట్టు దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకటించింది. సున్నితమైన డిజైన్లతో రూపొందించిన బంగారు హారాల నుంచి పెట్టుబడి కోసం కొనుగోలు చేసే బంగారు కడ్డీల వరకు అనేకరకాల ఉత్పత్తులతో దుబాయ్‌లోని సంప్రదాయ మార్కెట్లు చాలాకాలంగా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
అయితే ప్రతిపాదిత బంగారు నడక మార్గం ఒక భిన్నమైన ఆకర్షణగా నిలువనున్నది. విలువైన లోహాన్ని ప్రత్యక్ష అనుభవంగా మార్చేలా ఈ బంగారు మార్గాన్ని రూపొందిస్తున్నారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో నిర్మించే ఈ ఫుట్‌పాత్‌పై పర్యాటకులు నడుచుకుంటూ వెళ్తూ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ అందాలను వీక్షించొచ్చు. ఈ నడక మార్గం కచ్చితమైన పొడవు, నిర్మాణ వ్యయం, ప్రారంభ తేదీ వంటి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
రికార్డు స్థాయి బంగారు జుంకాలు
బంగారు నడకమార్గం ప్రకటన వెలువడిన సమయంలోనే దుబాయ్ మరో సంచలనాత్మక ఘనతను సాధించింది. సాంప్రదాయ భారతీయ శైలిలో చేతితో తయారుచేసిన ఒక జత జుంకా చెవిపోగులకు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు లభించాయి. జోయాలుక్కాస్ జ్యువెలరీ రూపొందించిన ఈ జత చెవిపోగుల బరువు 16.514 కిలోలు. వీటిని 22 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ‘మయూర సహస్త్ర’ అని పేరు పెట్టిన ఈ చెవిపోగులు ప్రపంచంలోనే అత్యంత బరువైన చెవిపోగుల జతగా, అతిపెద్ద చెవిపోగుల జతగా గుర్తింపు పొందాయి. ఈ చెవిపోగులను విక్రయానికి ఉంచకుండా, దుబాయ్‌లో ప్రజలు శాశ్వతంగా సందర్శించి వీక్షించేందుకు ప్రదర్శనలో ఉంచనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

