డీప్ ఫేక్‌తో 200 కోట్ల దోపిడీ
ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన డీప్‌ఫేక్ టెక్నాలజీకి సెలబ్రిటీలు, వీఐపీలే కాదు.. ఏకంగా కంపెనీలు కూడా బోల్తా పడుతున్నాయి. తాజాగా హాంకాంగ్‌కు చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీని ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీతో దుండగులు బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.200 కోట్ల (25.6 మిలియన్ డాలర్లు) సొమ్మును స్మార్ట్‌గా కొట్టేశారు.
- ఏకంగా సీఎఫ్‌వోను క్లోన్ చేసి..ఫేక్ జూమ్ మీటింగ్
- డబ్బులు కాజేసిన కేటుగాళ్లు
- హాంకాంగ్‌లో ఘరానా మోసం
న్యూఢిలీ : ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన డీప్‌ఫేక్ టెక్నాలజీకి సెలబ్రిటీలు, వీఐపీలే కాదు.. ఏకంగా కంపెనీలు కూడా బోల్తా పడుతున్నాయి. తాజాగా హాంకాంగ్‌కు చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీని ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీతో దుండగులు బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.200 కోట్ల (25.6 మిలియన్ డాలర్లు) సొమ్మును స్మార్ట్‌గా కొట్టేశారు. ఇందుకోసం కంపెనీ సీఎఫ్‌వోను డీప్‌ఫేక్ టెక్నాలజీతో క్లోన్ చేశారు.
ఆ కంపెనీ ఉద్యోగుల గొంతులు, రూపాలకు నకిలీలు సృష్టించారు. వీరంతా కలిసి కంపెనీలోని అకౌంటెంట్ ఉద్యోగితో జూమ్ మీటింగ్‌లో వారంపాటు పలు దఫాలుగా సమావేశమవుతూ హాంకాంగ్‌లోని 6 బ్యాంకు అకౌంట్లకు దాదాపు రూ.200 కోట్లు జమచేయించారు. అనుమానం వచ్చిన ఆ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసం బయటపడింది. ఇప్పటివరకు నేరస్తులు ఎవరినీ అరెస్టు చేయలేదు అని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

