కొబ్బరికాయ సైజులో కణితి… సర్జరీ ద్వారా తొలగించిన డాక్టర్లు
పెద్ద పరిమాణంలో ఉన్న థైరాయిడ్ కణితులను సుమారు 250కు పైగా సర్జరీల ద్వారా తొలగించినట్లు డాక్టర్ సంగీత్ అగర్వాల్ తెలిపారు. అయితే కొబ్బరికాయ సైజులో ఉన్న ఇలాంటి కణితిని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు.
న్యూఢిల్లీ: కొబ్బరికాయ పరిమాణంలో ఉన్న కణితిని సర్జరీ ద్వారా డాక్టర్లు తొలగించారు. థైరాయిడ్ గ్రంధి వద్ద ఇంత పెద్ద సైజులో ఉన్న కణితిని చూడటం ఇదే తొలిసారని వారు తెలిపారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన 72 ఏళ్ల రైతు గొంతులోని థైరాయిడ్ గ్రంధి వద్ద కణితి ఏర్పడింది. కొబ్బరికాయ సైజులో అది ఉంది. దీంతో ఆహారం మిగడంతోపాటు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. గత ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతున్న ఆ రైతును ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రోగిని పరిశీలించిన వైద్యులు టెంకాయ సైజులో ఏర్పడిన కణితిని చూసి ఆశ్చర్యపోయారు. గత నెలలో మూడు గంటలపాటు సర్జరీ చేసి దానిని తొలగించారు.
కాగా, పెద్ద పరిమాణంలో ఉన్న థైరాయిడ్ కణితులను సుమారు 250కు పైగా సర్జరీల ద్వారా తొలగించినట్లు డాక్టర్ సంగీత్ అగర్వాల్ తెలిపారు. అయితే కొబ్బరికాయ సైజులో ఉన్న ఇలాంటి కణితిని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. సాధారణంగా శీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి 3-4 సెంటీమీటర్ల సైజు, 10-15 గ్రాముల బరువు ఉంటుందని అన్నారు. అయితే బీహార్ రైతు గొంతులో ఏర్పడిన కణితి 18-20 సెంటీమీటర్ల పరిమాణంలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ కణితిని తొలగించే క్రమంలో ఆ రోగి గొంతు మూగబోకుండా కాపాడం తమకు సవాల్‌గా మారిందన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓకల్ కార్డ్ నరాలు దెబ్బతినకుండా ఆ కణితిని విజయవంతంగా తొలగించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

