CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ (Joseph Vijay) అసెంబ్లీలో తన సంజ్ఞలపై రేగిన దుమారంపై వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వంగా ఎవరినీ అవమానపరిచేలా ప్రవర్తించలేదని విజయ్ తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నట్టుగా.. తాను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)ను బాడీ షేమింగ్ చేయలేదని విజయ్ స్పష్ట చేశారు. సభలో మాట్లాడుతున్న క్రమంలో తాను దవడ పట్టుకున్నానని.. అంతేతప్ప తనకు ఏ దురుద్దేశం లేదని విజయ్ వెల్లడించారు.
అసెంబ్లీలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను అవమానించారనే కథనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా, వ్యక్తిగతంగా ఒకరిని బాధ పెట్టేలా ప్రవర్తించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను హేళన చేశారని తనపై వస్తున్న ప్రచారంపై విజయ్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. సెప్టెంబర్ 7వ తేదీన శాసన సభలో మాట్లాడుతున్న సమయంలో తాను అనుకోకుండా అలా దవడ విరిగిన సంజ్ఞ చేశానని ఆయన తెలిపారు.
சட்டமன்றத்தில் 7.9.2026 அன்று காவல்துறை மானிய கோரிக்கையில், என்னுடைய பதிலுரையின் இடையேயான எனது உடல்மொழி எதேச்சையாக வெளிப்பட்டதுதானே தவிர, அது எவ்வகையிலும் உள்நோக்கம் கொண்டதில்லை என்பதைத் தெரிவித்துக்கொள்கிறேன். ஆகவே, தனிப்பட்ட முறையில் யார் மனதையும் புண்படுத்துகிற செயலாக அதை…
— TVK Vijay (@TVKVijayHQ) September 8, 2026
‘నేను మీకో విషయం స్పష్టం చేస్తున్నా. సెప్టెంబర్ 7వ తేదీన అసెంబ్లీలో పోలీస్ విభాగం గ్రాంట్స్ అంశంపై మాట్లాడుతుండగా.. నా శరీర భాష అనుకోకుండా అలా వచ్చేసింది. అంతేతప్ప ఒకరిని బాధ పెట్టాలని నేను అలా చేయలేదు. కాబట్టి.. నేను ఎవరినీ ఉద్దేశించిగానీ, ఎవరినో అవమానించాలనిగానీ అలా చేయలేదని.. నా తీరును ఎవరికీ ఆపాదించొద్దని అభ్యర్థిస్తున్నా’ అని విజయ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
సెప్టెంబర్ 7వ తేదీన సీఎం విజయ్ తన ప్రసంగం సమయంలో.. నిరసనగా డీఎంకే సభ్యులు స్పీకర్ గది వెలుపల బైఠాయించారు. సీఎం కామెంట్స్, చర్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) నాయకుడు పీ షణ్ముగం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో అంతర్గత భద్రత చట్టం అమలులో ఉన్నప్పుడు స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రమంలో ఆయన దవడకు తీవ్ర గాయమైందని, ఆయన రూపాన్ని వెక్కిరించేలా సీఎం ప్రవర్తించడం ఆక్షేపణీయమని ఆయన తెలిపారు.