న్యూఢిల్లీ, ఆగస్టు 4: కొడీన్ ఆధారిత ఔషధాలు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొడీన్ మోతాదు ఎక్కువగా ఉన్న క్లోర్ఫినిరమైన్, మెంథాల్, ఫొల్కోడైన్ ఫార్ములాతో తయారవుతున్న టోస్సెక్స్, అసోరిల్ సీ, కోడిస్టార్, ప్లానోకఫ్, టెడీకఫ్ వంటి సిరప్లను నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. దగ్గు, నొప్పి, డయేరియా నివారణకు ఈ సిరప్లు ఉపయోగిస్తారు. కాగా నల్లమందు ఆకులతో కొడీన్ను తయారుచేస్తారు. మత్తు కలిగించడం, నొప్పి నివారణలో ఇది సాయపడుతుంది.