Mysore Pak | ‘మైసూర్ పాక్‌ను మైసూర్ పాక్ అనే పిలవండి’.. కకాసుర మడప్ప మునిమనవడి సూచన
Mysore Pak | పహల్గాం (Pahalgam) ఉగ్ర దాడి (Terror attack), ప్రతిగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor), ఆపై భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశంపై యావత్ భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.
Mysore Pak : పహల్గాం (Pahalgam) ఉగ్ర దాడి (Terror attack), ప్రతిగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor), ఆపై భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశంపై యావత్ భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) లో ఓ స్వీట్ల షాపు (Sweet shop) యజమాని తన షాపులో మైసూర్ పాక్ (Mysore Pak) పేరును ‘మైసూర్ శ్రీ (Mysore shree)’ గా మార్చాడు. ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాంతో దీనిపై రాయల్ కుక్ కకాసుర మడప్ప మునిమనవడు ఎస్ నటరాజ్ (S Nataraj) స్పందించారు.
ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ మైసూర్ పాక్ పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అది చారిత్రక వంటకమని, దాని పేరులోని పాక్‌కు, పాకిస్థాన్‌కు సంబంధం లేదని చెప్పారు. ‘మైసూర్ పాక్‌ను మైసూర్‌పాక్ అనే పిలవండి. మన పూర్వీకులు అందించిన ఆవిష్కరణకు ఇంకో పేరు ఉండదు. కన్నడలో ‘Paaka’ అంటే చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థం అని అర్థం. దీనిని తొలుత మైసూర్లో తయారు చేయడంవల్ల మైసూర్, పాకా కలిసి మైసూర్ పాక్ అని పేరు వచ్చింది. దీనిని వేరే పేరుతో పిలవడం అనవసరం. దీనికి వేరే అర్థాలు తీయొద్దు’ అని నటరాజ్ కోరారు.
మైసూర్‌లోని వడయార్ రాజకుటుంబానికి కకాసుర మడప్ప వంటవాడిగా ఉండేవారు. ఈ స్వీట్‌ను తొలుత తయారు చేసిన క్రెడిట్ ఆయనకే దక్కింది. మైసూర్ పాక్‌కు అప్పట్లో ఆయన పెట్టిన పేరును ఇప్పుడు మార్చడంపై నటరాజ్ అభ్యంతరం తెలియజేశారు. కాగా జైపుర్‌లోని ప్రముఖ ‘త్యోహార్ స్వీట్స్’ దుకాణం యజమాని.. మైసూర్ పాక్, మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ పేర్లను.. మైసూర్ శ్రీ, మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ అని మార్చాడు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషం పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశాడు.
అయితే ఈ పేర్ల మార్పుపై ‘త్యోహార్ స్వీట్స్’ దుకాణం యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ.. ‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు. ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు. పాక్ అనే పదానికి పాకిస్థాన్‌తో సంబంధం లేకపోయినా ఆ శబ్దం పాకిస్థాన్‌ను గుర్తుచేసేలా ఉండటంతో పేరు మార్చినట్లు తెలిపారు. శుభానికి సూచికగా ‘శ్రీ’ అనే పదం పెట్టినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

