పసివాడిని బలిచ్చిన అన్న.. బీహార్‌లో అమానుష ఘటన
బీహార్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాట్నా జిల్లాలోని జీతన్ ఛాప్రా గ్రామంలో శనివారం ఏడాదిన్నర వయస్సు గల బాలుడు హత్యకు గురయ్యాడు.
న్యూఢిల్లీ: బీహార్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాట్నా జిల్లాలోని జీతన్ ఛాప్రా గ్రామంలో శనివారం ఏడాదిన్నర వయస్సు గల బాలుడు హత్యకు గురయ్యాడు. దుర్గాదేవి ఆలయం వద్ద ఆ పసివాడి తల లభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ బాలుడి అన్న, 22 ఏండ్ల అజిత్ కుమార్ అలియాస్ బాలాను నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆడిస్తానని చెప్పి బాలా తన తమ్ముడిని ఇంటి సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యుల కథనం. ఆలయ ప్రాంగణంలో బాలుడిని హత్య చేసి, తలను అక్కడే వదిలేసి అక్కడి నుంచి అతడు పారిపోయినట్టు తెలుస్తున్నది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

