ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు.. బీజేపీ నేతతో పాటు అయిదుగురు అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనలో ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కేసులో బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయతో పాటు మరో అయిదుగుర్ని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి వరకు అశ్వినిని పోలీసులు విచారించారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కొన్ని వీడియోలు బయటకు రావడంతో పోలీసులు ఈ కేసును చేపట్టారు. హిందుస్తాన్ మే రెహనా హోగా.. జై శ్రీరామ్ కహనా హోగా అంటూ అరుస్తున్న ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న అశ్వినిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నలు తలెత్తాయి. ఫిర్యాదుల నేపథ్యంలో సోమవారం పోలీసులు కేసు విచారణ మొదలుపెట్టారు. మరో బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నా.. వీడియోల్లో మాత్రం అతను కనిపించలేదు.
బ్రిటీష్ చట్టాలకు వ్యతిరేకంగా సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆందోళన చేపట్టిందని, తనకు ఆ ఫౌండేషన్‌తో ఎటువంటి లింకు లేదని, కేవలం అతిథిగా మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అశ్విని తెలిపారు. సేవ్ ఇండియా డైరక్టర్ ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వినోద్ శర్మ, దీపక్ సింగ్, వినీత్ క్రాంతిలు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

