న్యూఢిల్లీ: ఒక పక్షి షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించింది. అయితే అది లోపల నుంచి ఏమి తెచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఒక పక్షి షాపింగ్ మాల్ వద్ద అటు ఇటూ తిరుగుతుంది. ఆటోమేటిక్ డోర్ తెరుచుకోగానే లోపలికి వెళ్లి ఒక చిప్స్ ప్యాకెట్‌తో వెంటనే బయటకు వస్తుంది. అనంతరం తన ముక్కుతో పొడిచి ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చిప్స్ తింటుంది. 44 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోకు “మాల్లో తెలివైన షాపింగ్” అనే శీర్షికను రూపిన్ శర్మ పెట్టారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. షాపింగ్ మాల్లో చిప్స్ ప్యాకెట్ చోరీ చేసిన పక్షి అని ఒకరు వ్యాఖ్యానించారు.