ఇంటికే బ్యాంకు

- ఇంటి వద్దే నగదు విత్ డ్రా సదుపాయం
- ఆధార్ పేమెంట్స్ ద్వారా పోస్టల్ సేవలు
- ఏఈపీఎస్‌తో అనుసంధానమైన బ్యాంకులకు వర్తింపు
- ఇంటికొచ్చి డబ్బు ఇవ్వనున్న పోస్టల్ ఉద్యోగి
న్యూఢిల్లీ, మే 28: లాక్డౌన్ వల్ల బ్యాంకుల్లో నగదు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి దగ్గరే ఉండి తమ ఖాతాలో నగదు పొందేలా పోస్టల్ విభాగం వెసులు బాటు కల్పించింది. ఆధార్ ద్వారా లావాదేవీలు జరిపేవారికి (ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీస్- ఏఈపీఎస్) పోస్టల్ ఉద్యోగులు ఇంటికి వచ్చి నగదు అందిస్తున్నారు. అయితే, దీని కోసం బ్యాంకులో ఖాతా ఉండి, దానికి ఆధార్ కార్డు అనుసంధానం అయి ఉండాలి. బ్యాంకు కచ్చితంగా ఏఈపీఎస్‌లో భాగస్వామి అయి ఉండాలి. ఆధార్ ద్వారా జరిగే నగదు లావాదేవీలు బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా పూర్తవుతాయి.
ఆధార్ ఎనేబుల్ పేమెంట్ అంటే?
ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఒకరకమైన చెల్లింపు సేవ. ఇది బ్యాంక్ వినియోగదారులు ఆధార్‌ను ఉపయోగించి లావాదేవీలు నిర్వహించడానికి అనుమతినిస్తుంది. ఏఈపీఎస్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)లో భాగస్వాములుగా ఉన్న బ్యాంకుల్లోని ఖాతాదారులకు ఇది అందుబాటులో ఉంటుంది.
ఏయే సేవలు లభిస్తాయి?
ఏఈపీఎస్ ద్వారా బ్యాలన్స్ ఎంక్వైరీ, ఆధార్ కార్డు నుంచి ఆధార్‌కార్డుకు నగదు లావాదేవీలు, నగదు విత్‌డ్రా, మినీ స్టేట్మెంట్ సేవలు పొందవచ్చు.
ఇంటి దగ్గరే డబ్బు ఎలా పొందవచ్చు?
- ఖాతాదారు 155299కు కాల్ చేసి పోస్టల్ ఉద్యోగి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి.
- అపాయింట్మెంట్ బుక్ అయినట్టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.
- ఆ తర్వాత ఐపీపీబీ ప్రతినిధి ఇంటికి వస్తారు. బ్యాంకు వివరాలు లేదా మొబైల్ నంబర్ లాంటి సమాచారం తెలుసుకుంటారు.
- తర్వాత బయోమెట్రిక్ ఆధారంగా బ్యాంకు ఖాతా నుంచి ఆ ప్రతినిధి నుంచే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

