బాబా కా దాబా ఓనర్ ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: ఒక్క యూట్యూబ్ వీడియోతో పాపులర్ అయిపోయిన ఢిల్లీలోని బాబా కా దాబా ఓనర్ కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్యాయత్నం చేశాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరగగా.. అతన్ని వెంటనే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. తమకు గురువారం రాత్రి 11.15 గంటల సమయంలో సమాచారం తెలిసిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాంతా ప్రసాద్ మద్యంతోపాటు నిద్రమాత్రలు మింగినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ వెంటనే అతడు స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
2020లో గౌరవ్ వాసన్ అనే ఓ యూట్యూబర్ కాంతా ప్రసాద్, అతని భార్య నిర్వహిస్తున్న దాబాపై తీసిన వీడియోతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయారు. వాళ్లు ఎంతో కష్టంగా బతుకీడుస్తున్నారని, ఆదుకోవాలని సదరు యూట్యూబర్ తన ఫాలోవర్లను కోరాడు. ఆ వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కాంతా ప్రసాద్‌కు సపోర్ట్ చేయండంటూ సెలబ్రిటీలు కూడా కోరారు. దీంతో బాబా కా దాబా ఫేమస్ అయింది.
అయితే దేశం నలుమూలల నుంచి తనకు వచ్చిన విరాళాల విషయంలో ఆ యూట్యూబర్ గౌరవ్ వాసన్, కాంతా ప్రసాద్ మధ్య వివాదం చెలరేగింది. తనకు వచ్చిన భారీ విరాళాలతో కాంతా ప్రసాద్ ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. కానీ ఈ ఏడాది మొదట్లో దానిని మూసివేశాడు. వాళ్లు ఈ మధ్యే తిరిగి తమ పాత ప్లేస్‌కు వెళ్లి బాబా కా దాబా ప్రారంభించారు. ఇంతలోనే కాంతా ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

