Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
Ajmer Jailer | ఒక మహిళా జైలర్ ఎలాంటి అనుమతి లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. వారితో ఇంటిని శుభ్రం చేయించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ మహిళా జైలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
జైపూర్: ఒక మహిళా జైలర్ ఎలాంటి అనుమతి లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. వారితో ఇంటిని శుభ్రం చేయించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ మహిళా జైలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (Ajmer Jailer) రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. అజ్మీర్ సెంట్రల్ జైలులో జైలర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల దివ్య చౌదరి, వేర్వేరు హత్య కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కిరణ్, సనా అనే ఇద్దరు మహిళా ఖైదీలను జూలై 12న జైలు నుంచి బయటకు తీసుకెళ్లారు. కోర్టు అనుమతి లేకుండా, జైలు రికార్డులలో ఎలాంటి వివరాలు నమోదు చేయకుండా ఆ మహిళా ఖైదీలను ఒక ప్రైవేట్ వాహనంలో అజ్మీర్‌లోని తన ఫ్లాట్‌కు తరలించి వారితో క్లీనింగ్ చేయించారు.
కాగా, ఈ విషయం జైలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 5న అజ్మీర్ సెంట్రల్ జైలు గార్డ్ మహిపాల్ ఫిర్యాదు చేశారు. మహిళా ఖైదీలను బయటకు తీసుకెళ్లడాన్ని జైలు సిబ్బంది అడ్డుకున్నప్పుడు జైలర్ దివ్య, గార్డు సోనియా జైలు ప్రధాన ద్వారం వద్ద వారిని బెదిరించినట్లు ఆరోపించారు. కొంత సమయం తర్వాత ఆ ఇద్దరు ఖైదీలను తిరిగి జైలుకు తీసుకువచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో జైలర్ దివ్యతో పాటు ఆమెకు సహాయం చేసిన జైలు గార్డు సోనియా చౌదరిలను సస్పెండ్ చేశారు. అనంతరం వారిద్దరూ పరారీలో ఉన్నారు.
మరోవైపు సాంకేతిక ఆధారాల ద్వారా దివ్య ఆచూకీని పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 6న కోటాలోని ఒక నివాస గృహంలో ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత రిమాండ్ కోసం జైలర్‌గా ఆమె విధులు నిర్వహించిన అదే జైలుకు తరలించారు. పరారీలో ఉన్న సోనియా కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

