Saree | కాపురంలో చీర చిచ్చు.. విడాకుల దాకా వెళ్లిన చీరల లొల్లి
Saree | నాకు నచ్చిన చీరలే నా భార్య కట్టుకోవాలనేది ఆ భర్త పంతం. నాకు కూడా నచ్చాలి కదా! నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాననేది భార్య ప్రశ్న. ఈ చీరల లొల్లి కోర్టుకెక్కింది. విడాకుల దాకా వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన దీపక్ అనే వ్యక్తికి, హత్రాస్‌కు చెందిన యువతితో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది.
- తనకు నచ్చిన చీరలే కట్టుకోవాలని భర్త ఒత్తిడి
- కుదరదన్న భార్య.. విడాకుల కోసం దరఖాస్తు
Saree | ఆగ్రా, మార్చి 2: నాకు నచ్చిన చీరలే నా భార్య కట్టుకోవాలనేది ఆ భర్త పంతం. నాకు కూడా నచ్చాలి కదా! నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాననేది భార్య ప్రశ్న. ఈ చీరల లొల్లి కోర్టుకెక్కింది. విడాకుల దాకా వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన దీపక్ అనే వ్యక్తికి, హత్రాస్‌కు చెందిన యువతితో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. పైండ్లెన తర్వాత భార్య కోసం దీపక్ చాలా చీరలు కొని తెచ్చాడు. అయితే, ఈ చీరలు ఆమెకు నచ్చలేదు. కానీ, దీపక్ మాత్రం ఇవే చీరలు కట్టుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు.
నాకు నచ్చని చీరలు నేనెందుకు కట్టుకుంటా? అని భార్య మొండికేసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇరు కుటుంబాల పెద్దలు కలగజేసుకొని నచ్చజెప్పినా లాభం లేకపోయింది. పైగా పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో భార్యాభర్తలిద్దరినీ కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా వీరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. దీంతో దంపతులిద్దరు విడాకులు కోరుతూ.. ఆగ్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agra Woman
- Deepak
- divorce
- Hatras
RELATED ARTICLES
తాజా వార్తలు
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
మరో పోరుకు నాంది పలుకుదాం
ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

