Odisha | ఆలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు సహా 8 మంది దుర్మరణం
ఒడిశాలోని కేంఘహార్ (Keonjhar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి (Balijodi) వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది.
భువనేశ్వర్: ఒడిశాలోని కేంఘహార్ (Keonjhar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి (Balijodi) వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది తీవ్రగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి జీపు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో జీపులో 20 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. కెంఝహార్ జిల్లాలోని ఘటగావ్‌లో ఉన్న మాతా తారిణి ఆలయానికి (Maa Tarini shrine) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. వారంతా గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందినవారని వెల్లడించారు. బాధితుల్లో పలువురు మాజీ రాజ్యసభ సభ్యుడు రేణుబాల ప్రధాన్ బంధువులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటి తారణి దేవాలయం. ఇక్కడ పార్వతీ దేవిని పూజిస్తారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

