Silo collapsed | ఐరన్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Silo collapsed | ఇనుము తయారీ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ముడి సరుకు నిలువ ఉంచేందుకు ఏర్పాటు చేసిన భారీ సైలో స్ట్రక్చర్ కుప్పకూలింది. ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో కూలీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Silo collapsed : ఇనుము తయారీ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ముడి సరుకు నిలువ ఉంచేందుకు ఏర్పాటు చేసిన భారీ సైలో స్ట్రక్చర్ కుప్పకూలింది. ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో కూలీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం ముంగేలి జిల్లా (Mungeli district) లోని సర్గావ్ (Sargoan) పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
సైలో స్ట్రక్చర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడే పనిచేస్తున్న పలువురు కూలీలు దాని కింద చిక్కుకున్నారు. కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. ఒక క్షతగాత్రుడిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ఆ తర్వాత మరో నాలుగు మృతదేహాలను వెలికితీశాయి.
కాగా సైలో స్ట్రక్చర్ కింద చిక్కుకున్న మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Chhattisgarh: Silo structure of an iron factory in Sargaon, Mungeli collapsed reportedly trapping labourers. One injured labourer has been admitted to a hospital. Police and Administration are present at the spot. Rescue operation is underway. pic.twitter.com/UjaGix0twl
— ANI (@ANI) January 9, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

