Watch: లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. వీడియో వైరల్ కావడంతో సస్పెండ్
Delhi Traffic Cops Divide Bribe Money | ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు.
న్యూఢిల్లీ: ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. (Delhi Traffic Cops Divide Bribe Money) సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం గాజీపూర్‌లోని థ్రిల్ లారీ సర్కిల్లో ఉన్న పోలీస్ చెక్‌పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు పిలిచారు. అతడితో వాదన తర్వాత లంచంగా నోట్ల కట్టను పోలీస్ అధికారి తీసుకున్నాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లగానే ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు అక్కడ కూర్చొన్నారు. లంచంగా తీసుకున్న డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని గురించి ఎక్స్‌లో స్పందించారు. ఇద్దరు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్స్ , ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ముగ్గురు పోలీసులపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
दिल्ली ट्रैफिक पुलिस अधिकारी का रिश्वत लेते वीडियो वायरल
वीडियो गाजीपुर थाने के पास का बताया जा रहा है@DCPSouthDelhi @dtptraffic @CPDelhi @DelhiPolice @LtGovDelhi @DCPWestDelhi pic.twitter.com/QgROjCo80w
— The National Bulletin Hindi (@BulletinHindi) August 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

