ఢిల్లీ యువకుడిలో గర్భాశయం గుర్తింపు
ఢిల్లీలో వంధ్యత్వ విశ్లేషణ కోసం దవాఖానకు వెళ్లిన ఓ యువకుడికి(26) తన దేహంలో బాగా అభివృద్ధి చెందిన గర్భాశయం ఉందని తెలిసింది. డాక్టర్ సుశీల్ కర్బందా ప్రకారం.. వంధ్యత్వం కోసం చేసిన పరీక్ష, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కాన్‌లో అతడిలో అత్యంత అసాధారణమైన ప్రత్యుత్పత్తి శరీర నిర్మాణం(గర్భాశయం) బయటపడింది.
- వంధ్యత్వ పరీక్షకు వెళితే బయటపడ్డ అరుదైన శారీరక స్థితి
న్యూఢిల్లీ : ఢిల్లీలో వంధ్యత్వ విశ్లేషణ కోసం దవాఖానకు వెళ్లిన ఓ యువకుడికి(26) తన దేహంలో బాగా అభివృద్ధి చెందిన గర్భాశయం ఉందని తెలిసింది. డాక్టర్ సుశీల్ కర్బందా ప్రకారం.. వంధ్యత్వం కోసం చేసిన పరీక్ష, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కాన్‌లో అతడిలో అత్యంత అసాధారణమైన ప్రత్యుత్పత్తి శరీర నిర్మాణం(గర్భాశయం) బయటపడింది. అయితే అతడి వృషణ కోశంలో రెండు వృషణాల లేవని వైద్యులు గుర్తించారు.
అతడి వీర్యంలోనూ శుక్ర కణాలు లేవు. పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (పీఎండీఎస్) అనే అరుదైన పరిస్థితి వల్ల పురుషుడిలో గర్భాశయం ఉండటం జరగొచ్చని ఆండ్రాలజిస్ట్ డాక్టర్ చిరాగ్ భండారీ తెలిపారు. అంటే పురుషుడికి వృషణాలు, పురుషాంగం లాంటి సాధారణ బాహ్య జననేంద్రియాలు ఉన్నప్పటికీ అతడి శరీరంలో గర్భాశయం కూడా ఉండిపోతుంది. పీఎండీఎస్ ఉంటే అతని పురుష తత్వానికి ఇబ్బంది లేదని.. అతను కూడా తండ్రి కావొచ్చన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

