అన్షుక.. ద యోగా గురు!
దీపికా పదుకొణె, అనన్యా పాండే, కరీనా కపూర్, ఆలియా భట్... వీరందరి మధ్యా ఓ సారూప్యత ఉంది. అదే అన్షుక పర్వాని. యోగా టీచర్! అన్షుకకు చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. ఈత నేర్చుకుంటే ఊపిరితిత్తులు బలంగా మారతాయని ఆమెకు ఇంట్లోవాళ్లు ఈత నేర్పించారు.
దీపికా పదుకొణె, అనన్యా పాండే, కరీనా కపూర్, ఆలియా భట్… వీరందరి మధ్యా ఓ సారూప్యత ఉంది. అదే అన్షుక పర్వాని. యోగా టీచర్! అన్షుకకు చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. ఈత నేర్చుకుంటే ఊపిరితిత్తులు బలంగా మారతాయని ఆమెకు ఇంట్లోవాళ్లు ఈత నేర్పించారు. ఈతలో చాంపియన్‌గా అవతరించిన అన్షుక దృష్టి తర్వాత కాలంలో విమానయానం మీదకు మళ్లింది. ఆకాశంలో పక్షిలా దూసుకుపోవాలనుకుంది. అనుకున్నది సాధించింది కూడా. సుశిక్షిత పైలట్‌గా చరిత్ర సృష్టించింది. ఇలాంటప్పుడే ఓ అనుకోని సవాలు ఎదురైంది.
ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అన్షుక, ఏకంగా ఎనిమిది నెలల పాటు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. ఇక మీదట తను పైలట్‌గా కొనసాగలేనని అర్థమైంది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు చెదరిన కలలు. ఇలాంటి క్లిష్ట సమయంలో అన్షుకకు వాళ్ల అమ్మ యోగాను పరిచయం చేసింది. అందులోనూ లోతైన శిక్షణ తీసుకుందామె. యోగా ఓ గొప్ప వరం అంటారు అన్షుక. దాంతో అద్భుతాలు సాధించవచ్చని స్వీయ అనుభవంతో తెలుసుకున్నారు. ఆ నేర్పు ఇతరులకు అందించే ప్రయత్నంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో తన దగ్గర శిష్యులుగా మారారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

