సామాన్య రూపాన్ని సౌందర్యంగా.. సౌందర్యాన్ని మహాసౌందర్యంగా మార్చగల మహత్తు అలంకరణకు ఉంది. అందులోనూ మిర్రర్ వర్క్ ముద్దొచ్చేలా తీర్చిదిద్దగలదు.
ఎల్లో ఆర్గంజా గార్డెన్ ప్రింట్ స్కర్ట్.. ఎల్ల లోకాల దేవకాంతలకూ సవాలు విసిరేలా ఉంది. వజ్రాలు, ముత్యాలు, పచ్చలు పొదిగిన చోకర్ శంఖంలాంటి మెడకు సొగసైన అలంకారం. ఉంగరమైతే వేలి కొసలతోనే కుర్రకారును శాసిస్తుంది.