మరాఠీ ముదిత కశ్మీరా పరదేశి తెలుగు సినిమాల్లో వెలుగులీనుతున్నది. ఎడమకాలి మీద కట్ వచ్చిన పిస్తాపచ్చ రంగు మ్యాక్సీ డ్రెస్‌లో మెరుస్తున్నది ఆ అందమే. స్లీవ్‌లెస్ తరహాలో రూపొందిన ఈ సింపుల్ డ్రెస్ ఎదభాగంలో నాట్స్‌తో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది.
చెవులకు ఇయర్ హూప్స్లా.. తెల్లటి రాయి వేలాడే పోగుల్ని ధరించింది. కాస్త పక్క పాపిట తీసి విరబోసిన జుట్టు ‘సింపుల్ అండ్ స్వీట్’గా కనిపించేలా చేస్తున్నది. గతంలో ‘నర్తనశాల’లో నటించిన ఈ అమ్మడు తాజాగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అంటూ మన ముందుకు వచ్చింది.
-సి.ఎం. ప్రవీణ్