అడుగుల సవ్వడి వినిపిస్తే.. అతనే అనిపిస్తుంది. గుప్పుమనే పెరటి మల్లెలు.. అతగాడి అత్తరు ఘుమఘుమలను గుర్తుకు తెస్తాయి. సర్వాలంకారాలతో సర్వస్వమైనవాడి కోసం ఎదురుచూస్తున్న ఈ విరహోత్కంఠిత తన మనసుకు అద్దం పట్టే ముస్తాబే చేసుకుంది. కళాత్మకంగా తీర్చిదిద్దిన లెహంగా, బ్లౌజ్, దుపట్టా.. ప్రత్యేకతలో దేనికదే పోటీపడతాయి. మెడలోని యాంటిక్ జువెలరీ వస్ర్తాలకు అతికినట్టు సరిపోయింది. అతనొస్తే.. ఆమె మందస్మిత అవుతుంది. అలంకరణకు పరిపూర్ణత చేకూరుతుంది.