వార్డ్రోబ్ తెరవగానే కాళ్ల మీద పడే బట్టలు, మడత పెట్టడం పూర్తయినా ఎక్కడ సర్దాలో తెలియని దుస్తులు.. మనల్ని చికాకుకు గురిచేస్తాయి. ఈ ఇబ్బందిని పరిష్కరించి వస్ర్తాల అరను అందంగా, సౌకర్యంగా మార్చే పద్ధతి ఒకటుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ‘మేరీ కొండో’ విధానాన్ని ఈ కొత్త సంవత్సరం ప్రయత్నించి చూడండి!
ఊహించుకోండి
మీ వార్డ్రోబ్ ఎలా ఉండాలో ముందుగా మనసులో ఊహించుకోండి. తలుపులు తెరవగానే ఎలా కనిపించాలి అన్నదే కాదు, అలా కనిపించడం వల్ల మీ మనసుకు ఎంత హాయిగా అనిపిస్తుంది.. అనే కోణంలోనూ ఆలోచించండి. వార్డ్‌రోబ్‌లో సాధ్యమైనన్ని తక్కువ దుస్తులు, యాక్సెసరీస్ ఉండాలి. అందులోంచి ఏం ధరించినా మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా ఉండాలి. ఇదే కొలమానం.అందులో ఉన్నవన్నీ ఒక చోట పోగేయండి. అంత పెద్ద కుప్పను చూడగానే.. తక్షణం వీటిని ఒక గాడిన పెట్టాలన్న బలమైన సంకల్పం మొదలవుతుంది.
మెరుపు మెరిసిందా
వార్డ్‌రోబ్‌లో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి వస్త్రం మనం ఏరికోరి, బోలెడంత డబ్బు వెచ్చించి కొన్నవే. కాబట్టి, పక్కకి తీసేయడం కష్టం. అయినా సరే, ఆ క్షణంలో వాటిని చూడగానే మనసుకు ఆనందం కలిగితేనే ఉంచుకోండి. లేకపోతే నిర్దాక్షిణ్యంగా తొలగించండి. ఒక టాప్నో, చీరనో చేతికి తీసుకోగానే మీ కళ్లల్లో మెరుపు మెరిస్తేనే నిజమైన ప్రేమ ఉన్నట్టు.
సర్దడం చివర్లోనే..
ముందుగా తీసేయాల్సిన వాటి మీదే దృష్టి పెట్టండి. కొత్త ఏడాదిలో కొత్తగా కనిపించేందుకు ఏమేం కావాలో అవే ఉంచుకోండి. ఆ తర్వాతే, సర్దే పనికి శ్రీకారం చుట్టండి.
సరైన స్థానం ఇవ్వండి
మీరు వాడే ప్రతి వస్ర్తానికి, వస్తువుకు వార్డ్ రోబ్‌లో తగిన స్థానం కల్పించండి. అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కుక్కడం మానేసి, వాటికి
ఎంత స్థలం అవసరమో అంతా ఇవ్వండి. రాజీ వద్దు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ లేకపోతే మళ్లీ వార్డ్రోబ్ గందరగోళంగా తయారవుతుంది. ఈ పద్ధతులన్నీ ఫాలో అయితే మీ వార్డ్‌రోబ్‌కి కొత్త లుక్ ఖాయం. అరగంట, పావుగంట అయినా సరే.. మీ సమయం మిగలడమూ ఖాయమే.