Chinese astronauts | పిన్న వయస్కులైన చైనా వ్యోమగాముల రికార్డు.. ఆరున్నర గంటల్లో అంతరిక్ష కేంద్రానికి చేరిక
Chinese astronauts | చైనాకు చెందిన పిన్న వయస్కులైన వ్యోమగాములు (Chinese astronauts) రికార్డు సృష్టించారు. అంతరిక్ష నౌకను ప్రయోగించిన ఆరున్నర గంటల్లోనే ఆ దేశానికి చెందిన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
బీజింగ్: చైనాకు చెందిన పిన్న వయస్కులైన వ్యోమగాములు (Chinese astronauts) రికార్డు సృష్టించారు. అంతరిక్ష నౌకను ప్రయోగించిన ఆరున్నర గంటల్లోనే ఆ దేశానికి చెందిన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముగ్గురు చైనీస్ వ్యోమగాములతో కూడిన షెంజౌ-17 అంతరిక్ష నౌకను జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి గురువారం లాంచ్ చేశారు. అనంతరం 6.5 గంటల్లోనే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఫార్వర్డ్ పోర్ట్‌కు ఆ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా డాక్ అయ్యింది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగ సెంటర్ కమాండర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా, అంతరిక్షంలో వేరుగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి ఆరోసారి వ్యోమగాములను చైనా పంపింది. అయితే ఈసారి అతి పిన్న వయస్కులైన వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపడం 12వ మిషన్ ప్రత్యేకత. అక్కడకు చేరుకున్న ముగ్గురు పురుష వ్యోమగాముల సగటు వయస్సు 38 ఏళ్లు. సుమారు ఆరు నెలలపాటు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తారు.
మరోవైపు ఈ ఏడాది మే నుంచి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో ఉన్న షెన్‌జౌ-16 క్రూ సిబ్బంది స్థానాన్ని షెన్‌జౌ-17 వ్యోమగాములు భర్తీ చేస్తారు. షెన్‌జౌ-16 క్రూ సిబ్బంది అక్టోబర్ 31న భూమికి తిరిగి చేరుకుంటారు. కాగా, అమెరికన్, యూరోపియన్లు వ్యవహరించే ఆస్ట్రోనాట్స్, సోవియట్ లేదా రష్యన్ ‘కాస్మోనాట్స్’కు భిన్నంగా చైనా వ్యోమగాములను ‘టైకోనాట్స్’ అని పిలుస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

