ఇమ్రాన్ ఖాన్ ఆరోపణల్ని ఖండించిన అమెరికా..
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. తనను తప్పించేందుకు విదేశీ కుట్ర జరిగినట్లు ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ అన్నారు. గురువారం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చడంలో విదేశీ హస్తం ఉందని, అమెరికా ఆ ప్రయత్నం చేసిందని ఓ బెదిరింపు లేఖ గురించి ఇమ్రాన్ చెప్పారు. ప్రసంగంలో తొలుత అమెరికా అని చెప్పిన ఇమ్రాన్ ఆ తర్వాత సరిచేసుకుని ఓ విదేశీ హస్తం జోక్యం చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే శుక్రవారం వైట్‌హౌజ్ ప్రతినిధి కేట్ బిడింగ్ఫీల్డ్ దాని గురించి స్పందించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. అధికారం నుంచి ఇమ్రాన్‌ను తొలగించేందుకు అమెరికా కుట్ర పన్నిందా అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తమ ప్రమేయం ఏమీ లేదని అమెరికా తెలిపింది. స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిది నెడ్ ప్రైజ్ కూడా ఇమ్రాన్ వ్యాఖ్యల్ని తిరస్కరించారు. ఇమ్రాన్‌ను తొలగించాలని తమ ప్రభుత్వం భావించడం లేదన్నారు. పాక్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని, పాక్ రాజ్యాంగ్య వ్యవస్తను గౌరవిస్తాం, మద్దతు ఇస్తామన్నారు. కానీ ఇమ్రాన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

