US Soldier: మాడురో ఆపరేషన్‌పై బెట్టింగ్ పెట్టి 4 లక్షల డాలర్లు ఆర్జించాడు.. అమెరికా సైనికుడి అరెస్టు
US Soldier:నికోలస్ మాడురోను అమెరికా కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్లానింగ్‌కు చెందిన రహస్య సమాచారాన్ని సేకరించిన ఓ సైనికుడు .. పాలీమార్కెట్లో బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. సుమారు 4 లక్షల డాలర్లు ఆర్జించారు. రహస్య సమాచారంతో ఆక్రమార్జనకు పాల్పడిన ఆ సైనికుడిపై అభియోగాలు నమోదు అయ్యాయి.
కరోలినా: వెనిజులా మాజీ దేశాధ్యక్షుడు నికోలస్ మాడురోను అమెరికా దళాలు ఓ ఆపరేషన్ చేపట్టి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఆర్మీ(US Soldier)కి చెందిన 38 ఏళ్ల సర్జెంట్ గానన్ వెన్ వాన్ డైక్.. ఆ రహస్య సమాచారాన్ని వాడుకుని .. బెట్టింగ్ ద్వారా సుమారు 4 లక్షల డాలర్లు ఆర్జించినట్లు రుజువైంది. ఈ కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఆ సైనికుడిపై అభియోగాలు నమోదు చేశారు. త్వరలో అతనికి శిక్ష ఖరారు చేయనున్నారు.
వెనిజులాలో జరగబోయే మిలిటరీ ఆపరేషన్ గురించి పాలీమార్కెట్లో ఆ సైనికుడు బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన అతను ఓ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత తనకు ఉన్న మిలిటరీ వర్గాల లింకులతో రహస్య సమాచారాన్ని సేకరించాడు. మాడురోను నిర్బంధించబోతున్నట్లు బెట్టింగ్ పెట్టాడు. ఓ రహస్య అకౌంట్ ద్వారా తన బెట్టింగ్ ఆపరేషన్ కొనసాగించాడు. జనవరి 3వ తేదీన అమెరికా దళాలు మాడురోను నిర్బంధించిన విషయం తెలిసిందే.
అయితే మాడురో అరెస్టు చేసే లోపే.. అమెరికా సైనికుడు వెన్ వాన్ డైక్ సుమారు 4 లక్షల డాలర్లు సంపాదించాడు. ఆ కేసులో అతను దోషిగా తేలాడు. నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ బేస్‌లో పనిచేస్తున్న ఆ సైనికుడు వీపీఎన్ ద్వారా పాలీమార్కెట్ అకౌంట్‌ను ఆపరేట్ చేశాడు. విదేశాల నుంచి నెట్వర్క్ సాగిస్తూ బెట్టర్లను మోసం చేశాడు. ట్రేడింగ్ చేసిన ప్రతిసారి అతను కీలక సమాచారాన్ని ఇచ్చి ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆ సైనికుడికి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

