భారీ పేలుడు జరిపి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను టెస్ట్ చేసిన యూఎస్ నేవీ.. వీడియో

మియామి: అమెరికాకు చెందిన కొత్త, అత్యాధునిక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధానికి సిద్ధంగా ఉందో తెలుసుకోవడానికి యూఎస్ నేవీ ఓ భారీ పేలుడుతో టెస్ట్ చేసింది. యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్‌గా పిలుస్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిపారు. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ పేరుతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇది మొదటి పేలుడు. నీళ్లలో భారీ పేలుడుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
18144 కిలోల పేలుడు పదార్థాలతో ఈ పేలుడు జరిపినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. ఫ్లోరిడా తీరంలో అట్లాంటిక్ సముద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పేలుడు 3.9 తీవ్రత గల భూకంపంగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కొత్త యుద్ధ నౌకలపై అమెరికన్ నేవీ ఇలాంటి షాక్ ట్రయల్స్ నిర్వహిస్తూనే ఉంటుంది. ట్రయల్స్ ముగిసిన తర్వాత యుద్ధనౌకకు మరోసారి కొన్ని మరమ్మతులు నిర్వహిస్తారు.
#ICYMI USS Gerald R. Ford @Warship78 completes the 1st explosive event of Full Ship Shock Trials! Continuing the mission #NavyReadiness pic.twitter.com/Tx3w3c7eCm
— U.S. Navy (@USNavy) June 20, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

