US Judge: భార్యను కాల్చి చంపిన జడ్జి.. అతని ఇంట్లో 47 గన్స్.. 26 వేల బుల్లెట్లు
US Judge Jeffrey Ferguson: డిన్నర్ కోసం రెస్టారెంట్ వెళ్లారు. అక్కడ భార్యతో గొడవైంది. ఇంటికి వచ్చాక కూడా మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో తన కాలికి ఉన్న గన్ తీసి భార్యను కాల్చేశాడు. ఈ కేసులో జడ్జి ఫెర్గూసన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత మిలియన్ డాలర్ల బాండ్‌పై అతన్ని రిలీజ్ చేశారు.
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని జడ్జి(US Judge) తన భార్యను షూట్ చేసి చంపాడు. తన కాలుకు ఉన్న గన్ను తీసి భార్యను కాల్చాడు. కాలిఫోర్నియాలో దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులు అతని ఇంట్లో 47 గన్స్, 26 వేల బుల్లెట్లను గుర్తించారు.ఆ ఆయుధాలన్నీ అక్రమంగా కలిగి ఉన్నట్లు తేలింది. భార్యను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చినట్లు నిర్ధారించారు. ఈ కేసులో 72 ఏళ్ల జడ్జి జెఫ్రీ ఫెర్గూసన్‌ను అరెస్టు చేశారు. ఆరెంజ్ కౌంటీ కోర్టులో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అరెస్టు చేసిన సమయంలో ఆ జడ్జి బాగా తాగిన మత్తులో ఉన్నట్లు తేలింది.
రెస్టారెంట్లో డిన్నర్‌కు వెళ్లిన దంపతుల మధ్య ఓ విషయంలో వాగ్వాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో గన్‌తో పేలుస్తానని భార్యను తన చేయితో సంకేతం చేస్తూ బెదిరించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ ఇద్దరి మధ్య మాటలు ముదిరాయి. అయితే వేలితో బెదిరించడం కాదు, నిజంగా కాల్చాలన్నట్లు భార్య రెచ్చగొట్టింది. దీంతో ఆ జడ్జి తన కాలికి ఉన్న గన్ను తీసి షూట్ చేశాడు. ఆ కాల్పుల్లో 65 ఏళ్ల షెర్లీ చనిపోయింది.
2015 నుంచి కోర్టులో జడ్జిగా చేస్తున్న ఫెర్గూసన్.. తన భార్యను మర్డర్ చేయలేదని కోర్టుకు తెలిపారు. ఎటువంటి ఉద్దేశం లేదని, ప్రమాదవశాత్తూ షూటింగ్ జరిగిందని, ఇది క్రైం కాదని కోర్టుకు చెప్పినట్లు లాయర్ పౌల్ మేయర్ వెల్లడించారు. అయితే మిలియన్ డాలర్ల బాండ్‌పై జడ్జి ఫెర్గూసన్‌కు బెయిల్ మంజూరీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

