కింగ్ చార్లెస్ 3కి అసాధారణ హక్కులు… పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణాంతరం వారసత్వంగా ఆ దేశంతోపాటు కామన్ వెల్త్ దేశాల కొత్త రాజు చార్లెస్ 3కి అసాధారణ హక్కులు లభించాయి. ఎలిజబెత్ 2 కుమారుడైన ఆయనకు ఇంగ్లాండ్‌లో ఎన్నో సౌకర్యాలు, రాయితీలు దక్కాయి. అలాగే ఎలాంటి పాస్‌పోర్ట్ లేకుండానే విదేశాల్లో ఆయన ప్రయాణించవచ్చు. బ్రిటన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని ఆయన నడపవచ్చు. అయితే ఆయనకు ఓటు హక్కు ఉండదు.
కాగా, తల్లి ఎలిజబెత్ మాదిరిగానే కింగ్ చార్లెస్ కూడా ప్రతి ఏటా రెండు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఆయన పుట్టిన రోజు నవంబర్ 14. అయితే శీతాకాలం కావడంతో ప్రజా వేడుకల నేపథ్యంలో అధికారికంగా పుట్టిన రోజును వేసవి కాలం నెలలో కూడా జరుపుకోవచ్చని తెలుస్తున్నది. కింగ్ చార్లెస్‌కు రెగ్యులర్‌గా వస్తువులు, సేవలు అందించే కంపెనీలకు రాయల్ వారెంట్‌ను ఆయన జారీ చేస్తారు. దీంతో సంబంధిత కంపెనీలు ఆయా వస్తువులపై రాచరిక గుర్తింపు చిహ్నాన్ని వినియోగిస్తాయి.
మరోవైపు కింగ్ చార్లెస్‌కు బ్రిటన్ దేశ ప్రజలపైనే కాకుండా ఆ భూభాగంలోని జంతువులు, పక్షులపైనా అధికారం దక్కుతుంది. 12వ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్, వేల్స్ జలాశయాలు, నీటి వనరుల్లోని హంసలు, డాల్ఫిన్లు, తిమింగలాలను చక్రవర్తి ఆస్తిగా పరిగణిస్తున్నారు.
అలాగే రాజు కోసం ఒక అధికారిక కవి ఉంటారు. చక్రవర్తిని కీర్తించేలా కవితలు రాసేందుకు అధికారిక కవిని ప్రతి పదేళ్లకు బ్రిటన్ నియమిస్తుంది. ఆ కవికి 720 వైన్ బాటిళ్లు కూడా పరితోషికంగా ఇస్తారు. 17వ శతాబ్దం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

