కీవ్‌ను చుట్టుముట్టిన రష్యా దళాలు… ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య భావోద్వేగ పోస్ట్
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా దళాలు రాజధాని కీవ్ స్వాధీనానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. కీవ్‌ను అన్ని వైపుల రష్యా సైన్యం చుట్టుముట్టింది. ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. ఒకవైపు చర్చలు మొదలైనప్పటికీ మరోవైపు ఇరు దేశ దళాలు భీకరంగా తలపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ పౌరులతోపాటు అక్కడున్న మిగతా దేశాల ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. లక్షలాది ప్రజలు ఆ దేశాన్ని వీడుతున్నారు. కీవ్ పౌరులు బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కీ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదివారం ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ఒక పసి పాప ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘ఈ పసి బిడ్డ బాంబు షెల్టర్‌లో జన్మించింది. వాస్తవానికి ఆమె పుట్టుక పూర్తిగా భిన్నమైన పరిస్థితులలో, ప్రశాంతమైన వాతావరణంలో జరుగాలి. కానీ, ముఖ్యమైన విషయం ఏమిటంటే వీధుల్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ వైద్యులు, సహకరించే వ్యక్తులు ఈ చిన్నారి వెన్నంటే ఉన్నారు. ఈ పసి పాపను మనం రక్షించుకుంటాం. ఎందుకంటే మీరు ప్రియమైన దేశీయులు. నమ్మశక్యం కాని ఎంతో గొప్పవారు’ అని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు ఉక్రేనియన్ ఆర్మీకి మద్దతుగా నిలిచిన దేశ పౌరులను ప్రథమ మహిళ అయిన ఒలెనా జెలెన్స్కీ తన పోస్ట్‌లో కొనియాడారు. కేవలం రెండు రోజుల్లోనే సాయుధ ప్రతిఘటనకు ముందుకు వచ్చారంటూ ప్రశంసించారు. కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడాన్ని మెచ్చుకున్నారు.
ఉక్రేనియన్లు తమ పొరుగువారికి సహాయం చేశారని, అవసరమైన వారికి ఆశ్రయం ఇచ్చారని ఒలెనా జెలెన్స్కీ తెలిపారు. అలాగే సైనికులు, బాధితుల కోసం రక్తదానం చేశారని, శత్రు వాహనాలను నిలువరించారని పేర్కొన్నారు. ‘బాంబు షెల్టర్లలో జన్మించిన పిల్లలు, ఉక్రేనియన్లు తమను తాము రక్షించుకున్న శాంతియుత దేశంలో జీవిస్తారు’ అంటూ తన భావోద్వేగ పోస్ట్‌ను ఆమె ముగించారు.
కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, ఒలెనా వివాహం 2003లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. లింగ సమానత్వం వంటి సామాజిక అంశాలపై ఒలెనా జెలెన్స్కీ తన గొంతు వినిపించడంతోపాటు వాదిస్తుంటారు. దౌత్యపరమైన విధులను కూడా ఆమె నిర్వహిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

