డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బీమా లేదు… 70 ఏండ్లకుపైగా కారు నడుపుతున్న వ్యక్తి

లండన్: డ్రైవింగ్ లైసెన్స్, బీమా లేకుండానే ఒక వ్యక్తి 70 ఏండ్లకుపైగా కారు నడుపుతున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెట్టారు. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో ఈ ఘటన జరిగింది. పెట్రోలింగ్ పోలీసులు బుల్వెల్లోని టెస్కో ఎక్స్ట్రా సమీపంలో ఒక కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. వాహనం డాక్యుమెంట్లు, బీమా, అతడి డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు చూపాలని అడిగారు. అయితే అవేమీ తన వద్ద లేవని అతడు చెప్పాడు. 1938లో పుట్టిన తాను 12 ఏండ్ల వయసు నుంచి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్, బీమా లేకుండానే కారును నడుపుతున్నట్లు తెలిపాడు. తనను ఎప్పుడూ పోలీసులు అడ్డుకోలేదని, అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం కూడా జరుగలేదని వెల్లడించాడు.
కాగా, ఈ సంగతి తెలిసి నాటింగ్‌హామ్ పోలీసులు నోరెళ్లబెట్టారు. ఈ విషయాన్ని తమ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాము పట్టుకున్న వ్యక్తి 12 ఏండ్ల వయసు నుంచి డ్రైవింగ్ లైసెన్స్, బీమా లేకుండానే కారును నడుపుతున్నట్లుగా చెప్పాడని, దీనిని తాము నమ్మలేకపోతున్నామని అందులో పేర్కొన్నారు.
మరోవైపు, నాటింగ్‌హామ్‌లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల కారణంగా, చిన్న ప్రయాణాల్లో కూడా కెమెరా కంటపడే అవకాశమున్నదని పోలీసులు తెలిపారు. దీంతో ఏదో ఒక రోజు పట్టుబడక తప్పదని అన్నారు. ఈ నేపథ్యంలో మీ పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

