Tik Tok : చైనా, తైవాన్ దేశాల మధ్య మరో వివాదానికి తెరలేచింది. ఈసారి ఆ వివాదానికి సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ కేంద్ర బిందువైంది. తమ దేశంలో అనుమతి లేకుండా వ్యాపారాన్ని విస్తరించేందుకు టిక్‌టాక్ ప్రయత్నిస్తుందని తైవాన్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారంపై లోతుగా అధ్యయనం చేసేందుకు దర్వాప్తునకు కూడా ఆదేశించింది. అయితే.. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ కంపెనీ మాత్రం తైవాన్ ఆరోపణలు పచ్చి అబద్దాలని కొట్టిపారేసింది. బైట్‌డ్యాన్స్ సంస్థ తైవాన్ చట్టాలను ఉల్లఘించిందని, తైవాన్ గడ్డపై కమర్షియల్ కంపెనీ నడిపేందుకు చైనా సోషల్‌మీడియా యాప్‌లకు అనుమతి లేదు అని తైవాన్‌కు చెందిన లిబర్టీ టైమ్స్ వార్తా పత్రికలో కథనం వెలువడింది.
బైట్‌డ్యాన్స్ సంస్థ తైవాన్‌లో వ్యాపార సంస్థను నిర్వహిస్తుందనే విషయం డిసెంబర్ 9వ తేదీన తైవాన్‌లోని చైనా పాలసీ మేకింగ్‌కు సంబంధించిన వ్యవహారాల మండలి దృష్టికి వచ్చింది. బైట్‌డ్యాన్స్ వ్యాపార కార్యకలాపాల గురించి లిబర్టీ టైమ్స్ వార్తా పత్రిక ప్రచురించింది. దాంతో, తైవాన్ ప్రభుత్వ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.