Sweden | స్టాక్హోమ్, జూన్ 3: శృంగారాన్ని ఒక క్రీడగా గుర్తించింది స్వీడన్ ఈనెల 8 నుంచి యూరోపియన్ సెక్స్ చాంపియన్షిప్ నిర్వహించనున్నది. ఈ పోటీ ఆరు వారాల పాటు కొనసాగనున్నది. ఇందులో పాల్గొనే జంటలు రోజుకు 45 నిమిషాల నుంచి గంట పాటు శృంగార కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుందట.
ఈ సమయంలో జంటల మధ్య కెమిస్ట్రీ, ‘కామసూత్ర’ ఆధారంగా శృంగారం పట్ల వారి అవగాహన వంటివి పరిశీలించి విజేతలను ఎంపిక చేయనున్నారు. విజేతల ఎంపికలో జడ్జిలతో పాటు ఆడియన్స్ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.