లండన్, నవంబర్ 13: సూర్యుడికీ అంతం ఉన్నదా? అంటే అవునంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆకాశంలో భగభగమండుతూ కనిపించే సూర్యుడు ఓ రోజు కొవ్వొత్తిలా మారిపోయి శాశ్వతంగా అస్తమిస్తాడట. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. సుమారు 450 కోట్ల ఏండ్ల క్రితం సూర్యుడు హైడ్రోజన్, హీలియంతో కూడిన పరమాణు మేఘం నుంచి ఆకృతిని పొందడం ప్రారంభించాడు.
అన్ని నక్షత్రాల్లాగే ప్రాణం పోసుకున్నాడు. అయితే, అన్ని నక్షత్రాల్లాగే సూర్యుడికి కూడా అంతం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడి కోర్ కుంచించుకుపోతుందని తేల్చారు. దాని బయటి పొరలు అంగారక గ్రహం కక్ష్య వరకు విస్తరిస్తాయి. మాంచెస్టర్ విశ్వవిద్యాలయం 2018లో చేసిన ఒక అధ్యయనం కంప్యూటర్ మాడలింగ్ను ఉపయోగించి సూర్యుడి అంతాన్ని గుర్తించారు.