Earth Quakes | వెనెజువెలాను వణికించిన భారీ భూకంపాలు.. కారకాస్‌లో కుప్పకూలిన భవనాలు.. Videos
Earth Quakes | వెనిజువెలా (Venezuela) లోని కరేబియన్ తీర ప్రాంతంలో సంభవించిన రెండు వరుస భారీ భూకంపాలు (Huge Earthquakes) ఆ దేశాన్ని వణికించాయి. రాజధాని కారకాస్ (Caracas) సహా పలు నగరాల్లో భూమి కంపించడంతో అనేక భవనాలు కుప్పకూలాయి. భారీ ఆస్తి నష్టం సంభవించడంతోపాటు కరీబియన్ తీర ప్రాంత దేశాలు సునామీ (Tsunami) భయంతో వణికిపోతున్నాయి. ఈ భూకంపాల కారణంగా భారీగా ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉంది.
Earth Quakes : వెనిజువెలా (Venezuela) లోని కరేబియన్ తీర ప్రాంతంలో సంభవించిన రెండు వరుస భారీ భూకంపాలు (Huge Earthquakes) ఆ దేశాన్ని వణికించాయి. రాజధాని కారకాస్ (Caracas) సహా పలు నగరాల్లో భూమి కంపించడంతో అనేక భవనాలు కుప్పకూలాయి. భారీ ఆస్తి నష్టం సంభవించడంతోపాటు కరీబియన్ తీర ప్రాంత దేశాలు సునామీ (Tsunami) భయంతో వణికిపోతున్నాయి. ఈ భూకంపాల కారణంగా భారీగా ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉంది. యూఎస్ జియోలాజికల్ సర్వే (US Biological Survey) నివేదిక ప్రకారం.. మొదట కారకాస్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలోని మొరోన్ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా.. సరిగ్గా దాని తర్వాతి నిమిషంలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం కుదిపేసింది.
భూ అంతర్భాగంలో కేవలం 1 0 నుంచి 13 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావడంవల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గడిచిన శతాబ్ద కాలంలో వెనిజువెలా ఎదుర్కొన్న అత్యంత బలమైన భూకంపాలలో ఇది ఒకటని చెబుతున్నారు. భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. అనేక భవనాల గోడలు కూలిపోయి లోపల ఉన్న ఫర్నిచర్ రోడ్డుపైకి కనిపించేలా దెబ్బతిన్నాయి. కారకాస్‌లోని ప్రముఖ అల్టామిరా పరిసర ప్రాంతాల్లో, తీర ప్రాంత నగరమైన లా గుఐరాలో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, గృహాలు కుప్పకూలాయి.
ప్రమాద స్థలాల నుంచి భారీగా ధూళి మేఘాలు గాల్లోకి లేచాయి. విద్యుత్, ఇంటర్నెట్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ప్రభుత్వ టెలివిజన్ ద్వారా మాట్లాడుతూ.. అల్టామిరా ప్రాంతంలో భవనాలు, ఇళ్లు కూలిపోయిన అత్యంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులతో సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు. తదుపరి ప్రకంపనలు వచ్చే ముప్పు ఉన్నందున ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంబులెన్సుల రవాణాకు ఆటంకం కలిగించకుండా వాహనదారులు సహకరించాలని కోరారు.
ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికాకు చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్యూర్టో రికో, యూఎస్ అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అలాగే వెనిజులా తీర ప్రాంతాలకు తక్షణ సునామీ అడ్వైజరీ జారీచేసింది. సముద్ర అలల్లో తీవ్ర మార్పులు, బలమైన పోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినప్పటికీ, సుమారు గంట తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో ఈ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. కరేబియన్, దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండే వెనిజువెలా తీవ్రమైన భూకంపాల జోన్లో ఉంది. 1821 నాటి స్వాతంత్ర్య యుద్ధ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినం జరుపుకుంటున్న రోజే ఈ ఘోర విపత్తు సంభవించింది.
1967 నాటి ప్రాణాంతక భూకంపం కంటే కూడా దీని తీవ్రత భయంకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
🇻🇪 A powerful 7.1-magnitude earthquake struck Venezuela, the European-Mediterranean Seismological Center reported. Buildings collapsed in Caracas, and a tsunami warning remains in effect. pic.twitter.com/BpclOxGPvf
— Маrina Wolf (@volkova_ma57183) June 24, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

