రెచ్చిపోయిన ఉడుత.. 18 మందిని కరిచి చివరికి ఏం చేసిందంటే?
ఒకచోట నిలకడగా ఉండవు. ఏవైనా గింజలు దొరికితే వాటిని తిని చెట్ల మీద నివాసముంటాయి ఉడుతలు. కానీ.. ఓ ఉడుత మాత్రం ఏ ఉడుత చేయని పని చేసింది. రెచ్చిపోయింది.
సాధారణంగా ఉడుతలు ఎవ్వరికీ హానీ కలుగజేయవు. చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటాయి. అటూ ఇటూ తిరుగుతుంటాయి. ఒకచోట నిలకడగా ఉండవు. ఏవైనా గింజలు దొరికితే వాటిని తిని చెట్ల మీద నివాసముంటాయి ఉడుతలు. కానీ.. ఓ ఉడుత మాత్రం ఏ ఉడుత చేయని పని చేసింది. రెచ్చిపోయింది. ఎవరు కనిపిస్తే వాళ్లను కరుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటన యూకేలోని వేల్స్ దగ్గర ఉన్న బక్లీలో చోటు చేసుకుంది.

అది గ్రే ఉడుత. ఆ జాతికి చెందిన ఉడుతలు ఎక్కువగా యూకేలోనే కనిపిస్తాయి. అవి కూడా ఎవ్వరికీ హాని చేయవు కానీ.. ఈ ఉడుత ప్రవర్తనలోనే తేడా వచ్చింది. దీంతో అందరినీ కరుచుకుంటూ వెళ్లిపోయింది. వెంటనే దాన్ని కొరిన్నే రేనాల్డ్స్ అనే మహిళ బంధించింది.
నిజానికి.. ఆ ఉడుతకు గత కొన్ని రోజుల నుంచి ఆవిడే ఆహారం అందించేది. రోజూ తన గార్డెన్‌కు వచ్చి అక్కడ గింజలు వేస్తే ఆ ఉడుత వాటిని తిని వెళ్లేది. ఒక రోజు ఆ ఉడుత.. ఆ మహిళ చేతుల్లో ఉన్న గింజలను తింటూ తనను కరిచి అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత చాలామందిని ఆ ఉడుత కరిచినట్టు ఆ మహిళ తెలుసుకుంది. ఫేస్బుక్లో కూడా చాలామంది ఉడుత చేసిన పని గురించి పోస్టులు పెట్టడం తెలుసుకొని దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని దానికి ఎర చూపించింది బంధించింది.
అప్పటికే అది ఆ టౌన్లోనే 18 మందిని కరిచినట్టు తెలిసింది. కొందరు ఉడుత కరిచినందుకు విరుగుడుగా ఇంజెక్షన్లు కూడా వేయించుకున్నారట. రెనాల్డ్స్ దాన్ని బంధించాక.. యానిమల్ సొసైటీ సభ్యులు వచ్చి తీసుకెళ్లి దానికి మత్తు ఇచ్చారు. నిజానికి.. యూకేలో గ్రే ఉడుతలను అడవుల్లో వదిలేయడం చట్టరిత్యా నేరం. అందుకే దాన్ని బంధించి ఇంజిక్షన్ల ద్వారా శాశ్వతంగా నిద్రపోయేలా చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

