Dog Meat: కుక్క మాంసం తింటే 3 ఏళ్లు జైలు శిక్ష.. దక్షిణ కొరియా కొత్త చట్టం
Dog Meat: కుక్క మాంసం తింటే ఇక జైలుకే. ఈ కొత్త చట్టాన్ని దక్షిణ కొరియా పార్లమెంట్ రూపొందించింది. తాజాగా ఆ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 208 మంది ఓటేశారు. మానవ వినియోగం కోసం కుక్క మాంసాన్ని వాడితే మూడేళ్ల జైలుశిక్ష పడనున్నది.
సియోల్: దక్షిణ కొరియా పార్లమెంట్ కీలక చట్టాన్ని రూపొందించింది. కుక్క మాంసం(Dog Meat) వినియోగాన్ని నిషేధిస్తూ కొత్తగా బిల్లును ఆమోదించింది. జాతీయ అసెంబ్లీలో 208-0 ఓట్ల తేడాతో ఆ తీర్మానానికి ఆమోదం దక్కింది. ఎన్నో శతాబ్ధాల నుంచి దక్షిణ కొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాక్టీస్‌ను నిషేధిస్తున్నారు. పార్లమెంట్ ఆమోదించిన తీర్మానంపై అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంతకం చేయనున్నారు. యూన్ ప్రభుత్వం కుక్క మాంసం వినియోగంపై బ్యాన్‌ను సమర్ధిస్తున్నది.
కొత్త బిల్లు ప్రకారం కుక్కల్ని చంపడం, బ్రీడింగ్ చేయడం, ట్రేడింగ్, అమ్మకాలు.. 2027 నాటికి అక్రమం కానున్నాయి. ఒకవేళ 2027 తర్వాత ఎవరైనా కుక్క మాంసాన్ని వినియోగిస్తే వాళ్లకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించనున్నారు. నిజానికి డాగ్ మీట్ బ్యాన్‌ను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. ఇప్పటికే ఆ దేశంలో కుక్క మాంస పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. దక్షిణ కొరియా ప్రజలు చాలా వరకు కుక్క మాంసాన్ని తినడం తగ్గించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

