Air accident : బ్రెజిల్ (Brezil) దేశంలోని రియో డి జనీరో (Rio de Janeiro) లో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు హెలికాప్టర్లు (Two Helicopters) ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ (American pop singer) ఒలీవర్ ట్రీ (Oliver Tree) సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. బ్రెజిల్ కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రియో పశ్చిమ ప్రాంతంలోని రెక్రియో డోస్ బాందీరాంటెస్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
రియో డి జనీరో అధికారుల వివరాల ప్రకారం.. యూరోకాప్టర్ AS350, బెల్ 206 రకాలకు చెందిన రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్నాయి. ఆ వెంటనే రెండు హెలికాప్టర్లు ముక్కలయ్యాయి. ఈ శకలాలు సమీపంలోని చైనాకు చెందిన బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డులో పడ్డాయి. దాంతో అక్కడ నిలిపి ఉంచిన 20 లగ్జరీ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలక్ట్రిక్ కార్లలోని లిథియం-అయాన్ బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, వాటిని ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది.
ఈ ప్రమాదంలో మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం బ్రెజిల్ వచ్చిన అమెరికన్ సింగర్, కమెడియన్ ఒలీవర్ ట్రీ (32) తోపాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ గ్యాస్పర్ ప్రిమ్ డియాస్ (గాస్పి), దర్శకుడు లూకాస్ విగ్నాల్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ లూకాస్ బ్రిటో చావెస్, ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ‘లైఫ్ గోస్ ఆన్’, ‘మిస్ యూ’ వంటి పాటలతో ఒలివర్ ట్రీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రమాదానికి ముందు రోజు రియో వీధుల్లో ఫుట్బాల్ ఆడుతున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఒలీవర్ ట్రీ ఆకస్మిక మరణంతో సంగీత ప్రపంచం, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై బ్రెజిల్ ఏవియేషన్ అథారిటీ, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా పైలట్ల తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో కాకుండా పార్కింగ్ యార్డులో శకలాలు పడటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తప్పిందన్నారు.
2 helicopters collide mid-air in Recreio dos Bandeirantes, Southwest of Rio de Janeiro. Six people have died in this unfortunate incident. pic.twitter.com/c34jhhjgwT
— Andleeb (@1stepAndleeb) June 14, 2026
Two Helicopters Collide in Rio de Janeiro, Killing at Least Six
Authorities are investigating the cause of the mid-air collision as details about those on board remain unclear. #WashingtonEye pic.twitter.com/Exf6E1v8cz
— Washington Eye (@washington_EY) June 14, 2026