Tit for tat: 36 దేశాల విమానాలను నిషేధించిన రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాలకు ప్రతిగా ఆంక్షలు విధిస్తున్నది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఐరోపాలోని 36 దేశాలు రష్యా విమానయాన సంస్థపై నిషేధం విధించాయి. దీంతో రష్యా కూడా ప్రతీకార చర్యలు చేపట్టింది. బ్రిటన్, జర్మనీ సహా 36 దేశాల విమానాలపై నిషేధం విధించింది. రష్యా ఎయిర్‌పోర్టుల్లో కార్యకలాపాలు, గగనతలాన్ని ఆయా దేశాల విమానాలు వినియోగించుకోవడాన్ని నిషేధించింది. రష్యా విమానయాన అథారిటీ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, జనీవాలోని ఐక్యరాజ్య సమితి పర్యటనను రద్దు చేసుకున్నారు. రష్యా విమానాలతోపాటు గగనతలం వినియోగంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధికారులు ఈ మేరకు వెల్లడించారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఐదో రోజుకు చేరింది. ఇరు దేశాలు ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు తలపడుతున్నాయి. రాజధాని కీవ్ స్వాధీనానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ గట్టిగా ప్రతిఘటిస్తున్నది. ఈ నేపథ్యంలో రష్యా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కీవ్ నగరాన్ని ఖాళీ చేయాలని ఉక్రేనియన్లకు సూచించింది. దీంతో సోమవారం ఉదయం కీవ్‌లో వైమానిక దాడి సైరన్లు హోరెత్తాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

