Putin | బంకర్లోకి పుతిన్.. ఫ్లూ భయమే కారణమా..?
క్రెమ్లిన్‌లోని చాలమందికి ఫ్లూ సోకిందని పుతిన్ అధికార ప్రతినిధి వెల్లడించాడు
Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఫ్లూ భయం వెంటాడుతోంది. అందుకని అతను బంకర్లో గడపనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం క్రెమ్లిన్‌లో చాలామందికి ఫ్లూ సోకడమేనట. దాంతో కొన్నిరోజులు పుతిన్ బంకర్లో క్వారంటరైన్లో ఉన్ననున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను ఈ ఏడాది పార్లమెంట్ ఎగువ సభ డ్యుమాలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నాడట. ఇప్పటికే ప్రతి ఏడాది నిర్వహించే మీడియా సమావేశాన్ని పుతిన్ రద్దు చేశాడు. క్రెమ్లిన్‌లోని చాలమందికి ఫ్లూ సోకిందని, ఈ విషయాన్ని పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించనట్టు ఒక నివేదిక చెప్పింది. ప్రతి ఏడాది పుతిన్ ముందస్తుగా రికార్డు చేసిన వీడియో ద్వారా దేశ ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తాడు.
గత కొన్ని రోజులుగా పుతిన్ ఆనారోగ్యంతో బాధపడుతున్నాడనే వార్తలు పలు పత్రికల్లో వచ్చాయి. అతనికి క్యాన్సర్ ఉందని కొన్ని వార్తా సంస్థలు రాశాయి. అయితే క్రెమ్లిన్ పుతిన్ ఆరోగ్య సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

