పెరూ అధ్యక్షురాలిగా దినా బొలార్టే.. తొలి మహిళగా రికార్డ్
Dina Boluarte: పెరూ దేశానికి తొలిసారి ఓ మహిళ దేశాధ్యక్షురాలయ్యారు. దినా బొలార్టే బుధవారం రాజధాని లిమాలో ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎం
లీమా: పెరూ దేశానికి తొలిసారి ఓ మహిళ దేశాధ్యక్షురాలయ్యారు. దినా బొలార్టే బుధవారం రాజధాని లిమాలో ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబసీకి వెళ్తున్న సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
దినా బొలార్టే వయసు 60 ఏళ్లు. ఆమె ఓ లాయర్. జూలై 2026 వరకు తానే అధికారంలో ఉండనున్నట్లు ఆమె తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోవాలని ఆమె అన్నారు. కొంత సమయం ఇస్తే దేశాన్ని కాపాడుతానని ఆమె తెలిపారు.
నిజానికి చాలా నాటకీయంగా పెడ్రో తొలగింపు ప్రక్రియ జరిగింది. టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన దేశంలో అత్యయిక స్థితిని ప్రకటించారు. కానీ పెడ్రో తీరును ఆగ్రహించిన ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. సుమారు 101 మంది నేతలు ఆయనపై అభిశంసన ప్రకటించాయి. ఆ తర్వాత పెడ్రోను పోలీసులు అరెస్టు చేశారు. పెడ్రో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

