కన్నబిడ్డని ఎవరైనా పెళ్లిచేసుకుంటారా ? న్యూయార్క్లో ఇలాంటి విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తన బిడ్డని పెళ్లిచేసుకోవడానికి అనుమతినివ్వమని కోరుతూ ఓ పేరెంట్ మాన్హాటన్ ఫెడరల్ కోర్ట్ లో పిటీషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఆశ్చర్యానికి లోనైంది.
ఎందుకంటే ఈ పిటీషన్ వేసింది తండ్రా..లేదంటే తల్లా అన్నది తెలియదు. అంతేకాదు ఆ పిటీషన్లో కనీసం వారు నివసిస్తున్న ప్రాంతం పేరును కూడా రాయలేదు. వారి మధ్య ప్రస్తుతం ఎలాంటి బంధం ఉందనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. వారు లైంగిక జీవితం కోసం వివాహం చేసుకోనున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది.
పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి.. తన బిడ్డకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకునాన్నని, ప్రస్తుత చట్టాలు దీన్ని మానసిక హాని కలిగించే చర్యగా భావిస్తున్నాయని పేర్కోవడం గమనార్హం. వీటిని రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలుగా పరిణగించాలని డిమాండ్ చేయడం విశేషం. అయితే ఈ పిటీషన్ని ఆమోదిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు అందించినట్లేనని పలువురు కోర్టులో వ్యతిరేకత వ్యక్తం చేశారు.