రసాయనాలతో రేపిస్టులకు శిక్ష.. పాక్ పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం

ఇస్లామాబాద్: సీరియల్ రేపిస్టులకు శిక్షను కఠినతరం చేస్తూ పాకిస్థాన్ పార్లమెంట్ కొత్త బిల్లును పాస్ చేసింది. అత్యాచార కేసుల్లో దోషులగా తేలిన వారికి.. రసాయనాల ద్వారా సెక్సు హోర్మెన్లను తగ్గించే శిక్షను విధించనున్నారు. ఇటీవల పాకిస్థాన్‌లో మహిళలు, చిన్నారుల పట్ల లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. అత్యాచార నేరాలను నియంత్రించాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త తరహా కఠిన చట్టాన్ని చేసింది. లైంగిక దాడులకు పాల్పడుతున్న వారికి కెమికల్స్ ద్వారా పురుష కణాలను నిర్వీర్యం చేసే శిక్షను అమలు చేయాలని బిల్లును చేశారు. ఏడాది క్రితమే అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు క్లియరెన్స్ ఇచ్చారు. రేప్ కేసుల్లో దోషుల వాంగ్మూలం తీసుకున్న తర్వాతే కెమికల్ క్యాస్ట్రేషన్ చేయాలని బిల్లులో పేర్కొన్నారు. నేర చట్ట సవరణ బిల్లు 2021తో పాటు మరో 33 బిల్లులకు పాకిస్థాన్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. కెమికల్ క్యాష్ట్రేషన్ శిక్షలో భాగంగా లైంగిక సామర్ధ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ వాడనున్నారు. అయితే మెడికల్ బోర్డు సమక్షంలో ఆ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా జమాత్ ఇ ఇస్లామి సేనేటర్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. ఇది షరియా చట్టానికి, ఇస్లామిక్ మత విశ్వాసాలకు వ్యతిరేకం అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
Tirumala | శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు
కారేపల్లిలో ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం
‘కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలి’
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

