North Korea | మరోసారి సాలిడ్ ఫ్యూయల్ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీ (Solid-Fuel Technology)తో రూపొందించిన ఖండాంతర క్షిపణిని (ICMB) ఉత్తర కొరియా (North Korea) మరోసారి పరీక్షించింది. ఒక కొత్త రకమైన ఘన-ఇంధన బాలిస్టిక్ క్షిపణి హసంగ్-18 (Hwasung-18)ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ కేఎన్సీఏ (KCNA) వెల్లడించింది.
ప్యాంగ్యాంగ్: సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీ (Solid-Fuel Technology)తో రూపొందించిన ఖండాంతర క్షిపణిని (ICMB) ఉత్తర కొరియా (North Korea) మరోసారి పరీక్షించింది. ఒక కొత్త రకమైన ఘన-ఇంధన బాలిస్టిక్ క్షిపణి హసంగ్-18 (Hwasung-18)ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ కేఎన్సీఏ (KCNA) వెల్లడించింది. 1,001 కిలోమీటర్ల ఎత్తులో సుమారు 70 నిమిషాల్లో 6,648 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జపాన్ సముద్రంలో కూలిపోయిందని పేర్కొంది.
అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆదేశాల ప్రకారం ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. ప్యాంగాంగ్ తన గగణత నిబంధలను అతిక్రమించిందిన ఆరోపించిన అమెరికా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రయోగం జరిపినట్లు పేర్కొంది. సాలిడ్ ఫ్యూయల్ ఖండాంతర క్షిపణిని ఈ ఏడాది ఏప్రిల్ 14 కూడా ప్రయోగించిన విషయం తెలిసిందే.
సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఏంటీ..
సాలిడ్ ఫ్యూయల్.. ఇంధనం, ఆక్సిడైజర్ సమ్మేళనం. ఘన ఇంధనంతో క్షిపణిని ప్రయోగిస్తారు. లోహాల ధాతువులతో ఘన ఇంధనాన్ని తయారు చేస్తారు. దీంట్లో అల్యూమినియం ఇంధనంగా వ్యవహరిస్తుంది. అమోనియం పర్చులోరేట్ని కూడా వాడుతారు. పర్చులోరిక్ ఉప్పు, అమోనియా కలిసి.. సాధారణ ఆక్సిడైజర్‌గా మారుతాయి.
ఇంధనాన్ని, ఆక్సిడైజర్‌ను ఓ హార్డ్ రబ్బర్ వస్తువులో మెటల్ ప్యాక్ చేస్తారు. ఘన ఇంధనం అంటుకున్నప్పుడు.. అమోనియా పర్చులోరేట్లో ఉన్న ఆక్సిజన్‌తో కలుస్తుంది. ఆ దశలో అత్యంత భారీ స్థాయిలో ఎనర్జీ రిలీజు అవుతుంది. దాదాపు 2760 డిగ్రీల సెల్సియస్ శక్తి విడుదల అవుతుంది. ఆ ఎనర్జీతోనే లాంచ్ ప్యాడ్ నుంచి మిసైల్ ఎగురుతుంది.
ఎవరి వద్ద ఆ టెక్నాలజీ ఉంది..
శతాబ్ధాల క్రితమే చైనాలో ఘన ఇంధనానికి చెందిన బాణాసంచాను డెవలప్ చేశారు. అయితే 20వ శతాబ్ధంలో దానికి చెందిన ప్రోగ్రెస్ చోటుచేసుకుంది. 1970 దశకంలోనే రష్యా తన తొలి సాలిడ్ ఫ్యూయల్ ఐసీబీఎంను పరీక్షించింది. ఆ తర్వాత ఫ్రాన్స్ మీడియం రేంజ్ ఎస్3 మిస్సైల్‌ను టెస్ట్ చేసింది. 1990 దశకం నుంచి ఐసీబీఎంలను చైనా టెస్టింగ్ చేయడం ప్రారంభించింది.
ఘన వర్సెస్ ద్రవ
లిక్విడ్ ఉత్ప్రేరకాలు ఎక్కువ శక్తిని రిలీజ్ చేస్తాయి. కానీ వాటి కోసం సంక్లిష్టమైన టెక్నాలజీ అవసరం ఉంటుంది. ఆ క్షిపణుల బరువు కూడా మరీ అధికంగా ఉంటుంది. ఇక ఘన ఇంధనం .. ఎక్కవ సాంద్రతతో ఉంటుంది. చాలా తొందరగా అది అంటుకుంటుంది. సాలిడ్ ఫ్యూయల్ ఎక్కువ కాలం డీగ్రేడ్ కాకుండా ఉంటుంది.
ఏం జరుగుతుంది..
కొత్త సాలిడ్ ఐసీబీఎంను డెవలప్ చేయడం వల్ల నార్త్ కొరియా తన న్యూక్లియర్ కౌంటర్ అటాక్ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. హసంగ్-18 క్షిపణితో అది అటాక్ చేసేందుకు సిద్దం అవుతోంది. కానీ ఆ టెక్నాలజీలో మాస్టర్ కావాలంటే నార్త్ కొరియాకు చాలా టైం పడుతుందని దక్షిణ కొరియా పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Hwasung-18
- ICMB
- Japan Sea
- KCNA
RELATED ARTICLES
తాజా వార్తలు
కోడి దొంగతనం కేసు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
AP News | ఏపీలో లోకల్‌బాడీ ఎన్నికలు.. ఈ నెల 26న 23 మున్సిపాలిటీల్లో సెలవు..!
లావుడియా తండా గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
Uttar Pradesh: యూపీలో 13.58 కోట్ల మంది ఓటర్లు.. ఎస్‌ఎస్‌ఆర్‌లో అదనంగా 18 లక్షల మంది
గోమర్దాకు కృష్ణ జింకలు.. జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

