మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
North Korea | ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్ సైన్యం ఓ బాలిస్టిక్ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది
సియోల్: ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్ సైన్యం ఓ బాలిస్టిక్ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. అమెరికా-దక్షిణకొరియా సైన్యాలు భారీస్థాయిలో సంయుక్త గగణతల విన్యాసాలు నిర్వహించిన నేపథ్యంలో హెచ్చరికగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది.
తూర్పు సముద్రం వైపు ఉత్తర కొరియాకు చెందిన ఓ క్షిపణిని దూసుకెళ్లిందని సియోల్ సైన్యం పేర్కొన్నది. తూర్పు సముద్రాన్ని జపాన్ సముద్రం అనికూడా పిలుస్తారు. కాగా, గత వారం రోజుల్లో జపాన్‌వైపు క్షిపణులను ప్రయోగించడం ఇది రెండోసారి. గత నెల 28న ఇదేతరహాలో తూర్పు సముద్రంవైపు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పరీక్షించింది.
కాగా, గత నెల రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడం ఇది ఎనిమిదోసారి. దాదాపు ఐదేళ్లలో తొలిసారిగా అక్టోబరు 4వ తేదీన ఉత్తర కొరియా జపాన్ మీదుగా మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించిన రెండు రోజుల తర్వాత, బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించబడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | దేశంలోని నగరాల్లో భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయంటున్న వైద్యులు..
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

