Nobel Prize: మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి
Nobel Prize: 2024 సంవత్సరానికి విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.
స్టాక్‌హోమ్: మెడిసిన్‌లో ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు. స్వీడెన్లోని స్టాక్‌హోమ్‌లో ఆ ప్రకటన చేశారు. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో విజేతను ప్రకటించారు. 2024 సంవత్సరానికి మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.
BREAKING NEWS
The 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY— The Nobel Prize (@NobelPrize) October 7, 2024
బహుకణ జీవుల్లో గడిచిన 500 మిలియన్ల ఏళ్లలో మైక్రోఆర్ఎన్ఏ ఎంతో రూపాంతంరం చెందినదని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనుషుల్లో ఉండే మైక్రోఆర్ఎన్ఏల్లో.. వేల సంఖ్యలో జనువులు ఉన్నాయని, అయితే జన్యువులను మైక్రోఆర్ఎన్ఏ రెగ్యులేట్ చేస్తున్నదని పేర్కొన్న శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించారు. మనుషుల్లో ఉండే మైక్రోఆర్ఎన్ఏ.. బహుకణ జీవుల్లోని ఆర్ఎన్ఏ ఒకే విధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. జన్యు నియంత్రణ గురించి ఎన్నో దశాబ్ధాలుగా స్టడీ జరుగుతోంది. ఒకవేళ జన్యు నియంత్రణ గతి తప్పితే, అప్పుడు తీవ్రమైన క్యాన్సర్, డయాబెటిస్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని నోబుల్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది.
విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లు 1ఎంఎం పొడువైన వానపాము సీ.ఎలిగాన్స్ జీవిని స్టడీ చేశారు. చాలా చిన్న సైజులో ఉండే ఆ జీవిలో.. ఎన్నో రకాల ప్రత్యేకమైన కణాలు ఉన్నాయి. ఆ రౌండ్వామ్లో నరాల, కణజాల కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇదే తరహా కణాలు.. అతిపెద్ద, సంక్లిష్టమైన జంతువుల్లోనూ గుర్తించవచ్చు. కణజాలం ఎలా వృద్ధి చెందుతుందన్న అంశాన్ని మైక్రోఆర్ఎన్ఏ ద్వారా స్టడీ చేశారు.
గత ఏడాది ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో.. కాటలిన్ కరికో, డ్రూ వైజ్మాన్లకు నోబెల్ బహుమతి దక్కింది. కోవిడ్19కు వ్యతిరేకంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీలో ఆ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు మెడిసిన్ ప్రైజ్‌ను 114 సార్లు మొత్తం 227 మందికి ఇచ్చారు. మెడిసిన్ కేటగిరీలో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఆ అవార్డు అందుకున్నారు. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్(మిలియన్ అమెరికా డాలర్లు) అందిస్తారు.
డిసెంబర్ 10వ తేదీన, సృష్టికర్త నోబెల్ ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తారు. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్యం రంగాల్లో ప్రైజ్‌లను ప్రకటించారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, ఇక అక్టోబర్ 14వ తేదీన ఆర్థిక శాస్త్రంలో బహుమతి ప్రకటిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవిష్యత్ బీఆర్ఎస్దే
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

