Omicron Effect | ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆ ప్రధాని పెండ్లి రద్దు చేసుకున్నారు.. ఎవరంటే?!
Omicron Effect | దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెన్ వేసవిలో జరిగే పెండ్లి రద్దు చేసుకున్నారు.

Omicron Effect | న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెన్ అద్భుత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆమె తన వివాహ వేడుకలను రద్దు చేసుకున్నట్లు ఆదివారం ప్రకటించారు. నా వివాహం జరుగదు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారితో బాధపడుతున్న దేశ పౌరుల బాధల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుందని మీడియాతో అన్నారు. ఇది జీవితం అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దేశంలో తాజాగా విధిస్తున్న ఆంక్షలతో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. తద్వారా కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ నెమ్మదిస్తుందన్నారు.
మొటైంకాలోని ఒక కుటుంబంలో తొమ్మిది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులకు తన దృష్టికి తెచ్చారని ఆర్డెన్ తెలిపారు. అత్యధిక రిస్క్ ఉన్న అక్లాండ్‌కు వివాహం కోసం గానీ, అంత్యక్రియల కోసం గానీ, వీకెండ్ పర్యాటక కేంద్రానికి వెళ్లినా ఇబ్బందికరం అని అధికారులు తనకు సూచించారన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే వేసవిలో తన పార్టనర్ క్లార్కే గేఫోర్డ్‌తో వివాహం చేసుకోవాల్సి ఉంది. వివాహం రద్దుపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇది జీవితం అని వ్యాఖ్యానించారు.
ఆదివారం అర్ధరాత్రి నుంచి న్యూజిలాండ్‌లో మాస్క్ వాడకం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర ఐలాండ్స్కు పెండ్లికి వెళ్లి వచ్చిన వారిలో తొమ్మిది మందికి వైరస్ సోకింది. వీరితో వైరస్ కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ప్రారంభమైందని తెలుస్తున్నది. ఒక కుటుంబానికి, విమాన ఉద్యోగికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో మార్క్ ధరించడం, బార్లు,రెస్టారెంట్లలో ఇండోర్ హాస్పిటల్ సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలకు 100 మంది అతిథులను అనుమతి ఇస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

