క్యాన్సర్‌ను చంపే వైరస్
వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కణాలను చంపే వైరస్‌ను అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను క్యాన్సర్ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు.
లండన్: వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కణాలను చంపే వైరస్‌ను అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను క్యాన్సర్ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు. ఇంగ్లండ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్, రాయల్ మార్స్డెన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ కలిసి.. క్యాన్సర్ కణాలను చంపేందుకు ఓ వైరస్‌లో జన్యు మార్పులు చేశారు. ఆ వైరస్‌ను క్యాన్సర్ కణాలు ఉన్న చోట ఇంజెక్షన్ ద్వారా జొప్పించారు.ఆ వైరస్.. క్యాన్సర్ కణాల పనితీరును దెబ్బతీసి, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేలా చేసింది.
అలా మెల్లిమెల్లిగా క్యాన్సర్ కణాలు మాయమైపోయాయి. యూకేకు చెందిన క్రజైస్టోఫ్ వోజ్కోవ్‌స్కీ (39) లాలాజల గ్రంథి క్యాన్సర్‌తో బాధపడేవాడు. అనేక దవాఖానలు తిరిగినా ఫలితం లేకపోయింది. జీవితంపై ఆశ కోల్పోయిన అతడు.. తనపై ‘వైరస్ చికిత్స’ ట్రయల్స్ కోసం రాయల్ మార్స్డెన్ వద్ద పేరు నమోదు చేసుకొన్నాడు. దీంతో అతడి శరీరంలోకి వైరస్‌ను ఎక్కించారు. ఆశ్చర్యకరంగా అతడి క్యాన్స ర్ మాయమైపోయింది. మొత్తం 9 మందిపై ట్రయల్స్ నిర్వహించగా ఇప్పటికే ముగ్గురు కోలుకొన్నారు. వారిలో మిగతా ఇద్దరు కంటి క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. మిగతా ఆరుగురిలో ఆశాజనక మార్పు కనిపిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- kills cancer
- new virus
- patient
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

