చైనాలో ‘మంకీ బీ’వ్యాధి సోకి పశువుల వైద్యుడి మృతి

బీజింగ్: చైనాను మరో కొత్త రకం వైరస్ భయపెడుతున్నది. చైనాలో మొదటిసారిగా ఓ వ్యక్తికి ‘మంకీ బీ వైరస్(బీవీ)’ సోకినట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం తెలిపింది. బాధితుడు 53 ఏండ్ల పశువుల వైద్యుడని పేర్కొంది. వైరస్ సోకిన రెండు మకాక్యూ జాతి కోతుల మృతదేహాలను ముట్టుకోవడంతో ఆయనకు ఈ వ్యాధి వ్యాపించిందని వెల్లడించింది. వికారంతో కూడిన వాంతులు పెరుగడంతో బాధితుడు పలు దవాఖానల్లో చికిత్స తీసుకున్నాడని, పరిస్థితి విషమించడంతో మే 27న మరణించాడని వివరించింది. అయితే, మృతుని నుంచి ఇతరులకు ఈ వైరస్ సోకినట్టు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. మకాక్యూ జాతి కోతుల ద్వారా సోకే ఈ ‘మంకీ బీ’ వైరస్ సోకిన వారికి సరైన చికిత్స అందించకపోతే మరణించే ప్రమాదం 70-80 శాతం వరకు ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి చికిత్సకు సరైన ఔషధాలు లేవు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Doctor died
- monkey b
- new virus
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

